నేను లోకల్ పూర్తి చేసాడు..

nenu-local-feb

నేచురల్ స్టార్ నాని కెరియర్ జెట్ స్పీడ్ గా ఉంది..పట్టిందల్లా బంగారమే అన్నట్లు అతడు చేసిందల్లా సినిమా సూపర్ హిట్ అవుతుంది..గత ఏడాది నాని చేసిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మెన్ , మజ్ను మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి..అంతే కాదు కథలు ఎంచుకోవడం లో నాని తర్వాతే ఎవరైనా అని అగ్ర హీరోలు సైతం అనుకునేలా సక్సెస్ సాధించాడు..

సినిమా చూపిస్తా మావ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో నేను లోకల్ మూవీ తో త్వరలో రాబోతున్నాడు. వాస్తవానికి ఈ మూవీ గత డిసెంబర్ లోనే థియేటర్స్ లోకి రావాల్సి ఉండే..కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోనే అయ్యింది. ఇటీవలే ఈ చిత్రానికి గుమ్మడి కాయ కొట్టడం జరిగిందట. ఫిబ్రవరి లో ఈ మూవీ ని రిలీజ్ చేయాలనీ దిల్ రాజు భావిస్తున్నాడు.

kerti-nani

ఈ మూవీ టీజర్‌కు ఇప్పటికే ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోన్న విషయం తెలిసిందే. నాని అభిమానులను అలరించడానికి త్వరలో ఈ సినిమా నుంచి ఓ పాట రాబోతుంది. ఈ నెల 6న సాయంత్రం 6గంటలకు నెక్ట్స్ ఏంటీ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ నానికి జోడీగా నటిస్తోంది.