మెగా క్యాంపునుంచి వచ్చిన మరో హరో, సుకుమార్ శిష్యుడు దర్శకుడు, ఈ రెండింటికీ మించి సూపర్ డూపర్ హిట్టైన “నీ కళ్ళు నీలిసముద్రం” పాట….. విజయ్ సేతు పతి విలన్.. వెరసి ఉప్పెనకి ఉప్పెనంత క్రేజ్ తీసుకొచ్చాయి. వీటికి తోడు పబ్లిసిటీలో భాగంగా సినిమాపై హైప్ అదరగొట్టారు. అంచనాలని అమాంతం పెంచేసారు. సినిమా విడుదల అయ్యింది. కలెక్షన్స్ కూడా బావున్నాయి. ఐతే ఈ లెక్కలు కేవలం సినిమా రూపకర్తలు మాత్రమే చెబుతున్నారు. అసలైన సినిమా లెక్కలు ఎప్పటికీ తెలియవు. అదొక రూలు అంతే. వసుళ్ళూ దండిగా వున్నాయని చెప్పడం కూడా పబ్లిసిటీని బాగమే.
అంతేకాదు ఈ సినిమా ఓ క్లాసిక్ అన్నంత రేంజ్ లో ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు. ఐతే ఈ మాట సినిమా చూసిన ప్రేక్షకుల నుండి వస్తే బావుండేది. కేవలం సినిమా యూనిట్ నుండే ఉప్పెన ఓ క్లాసిక్ అన్నంత రేంజ్ లో ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఉప్పెన లో ఇంత విషయం వుంటే .. ఈ పాటికి పబ్లిక్ టాక్ ఓ రేంజ్ లో వుండేది. కానీ ఉప్పెన సినిమా మొదటి రెండు రోజులు తప్పితే పబ్లిక్ లో మరీ అంత హడావిడి కనిపించడం లేదు. ఎదో సినిమా అన్నట్టుగానే వుంది తప్పితే అదిరిపోయే సినిమా అనే మాట కూడా వినిపించడం లేదు. నిజానికి నాలుగు రోజుల తర్వాతే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఉప్పెన విషయంలో యూనిట్ హంగామ తప్పితే మౌత్ టాక్ మహిమ లేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ .