నాని సినిమాకి బాంబే హైకోర్టు షాక్

నాని సినిమాఐ షాక్ తగిలింది ‘అమెజాన్ ప్రైమ్’లో విడుదలైన నాని సినిమా ‘వి’లో అనుమతి లేకుండా తన ఫొటోను వాడారంటూ బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. చిత్ర నిర్మాతలపై పరువునష్టం కేసు వేసింది.

ఈ సినిమాలో ఓ సందర్భంలో మొబైల్ ఫోన్‌లో చూపించే కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా తన ఫొటోను చూపించారని, అనుమతి లేకుండా ఆ ఫొటోను వాడి తన పరువుకు భంగం కలిగించారని సాక్షి మాలిక్ ఫైర్ అయ్యింది.

విచారణ జరిపిన న్యాయస్థానం ‘ఇది ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమే’నని వ్యాఖ్యానించింది. ఓటీటీ నుంచి దీనిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఫొటోను బ్లర్ చేయడం లాంటివి కాకుండా పూర్తిగా తొలగించాలని పేర్కొన్న ధర్మాసనం, 24 గంటల్లో సినిమాను తొలగించాలని ఆదేశించింది.