కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేశారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. అయితే సినిమా నుండి బయటికి వచ్చేసింది త్రిష. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ”కొన్ని విషయాలు మారిపోతుంటాయి. ముందు ఒకలా తర్వాత మరోలా. క్రియేటివ్ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. యూనిట్ కి అభినందనలు. ఆల్ ది బెస్ట్ ” అని ట్వీట్ చేసింది త్రిష. అయితే దిని వెనుక స్పష్టంమైన రీజన్ మాత్రం చెప్పలేదు.
కాగా దీనిపై మెగాస్టార్ స్వయంగా స్పదించారు. ” ఈ విషయాన్ని గురించి నేను యూనిట్ సభ్యులతో మాట్లాడాను. ఎవరితోనూ ఆమెకి ఎలాంటి గొడవలేదు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చింది. అందువల్లనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదు” అని చెప్పుకొచ్చారు చిరు.