తేజ మామూలు దర్శకుడు కాదు. చిత్రం`తో చిత్రసీమని ఓ కుదుపు కుదిపాడు తేజ. చిన్న సినిమాని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సినిమా నుంచే కొత్త టాలెంట్ బయటికి వచ్చింది. జయం, నువ్వు – నేను.. ఇలా వరుసగా హిట్లు కొట్టి తనకు తిరుగులేదనిపించాడు. ఆ తరవాత.. తేజ నుంచి అన్నీ ఫ్లాపులే.
ఐతే `నేనే రాజు నేనే మంత్రి`తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు తేజ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. అయినా.. సరే, తనదైన పాత పంథాలో ఇప్పుడు మరో `చిత్రం` చేయడానికి రెడీ అయ్యారు. దీనికి చిత్రం 1.1 అనే పేరు పెట్టారు. తేజతో పాటు ప్రయాణం ప్రారంభించిన ఆర్పీ పట్నాయక్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చిత్రంలా పాత్ బ్రేకింగ్ ఐడియాతో రూపొందుతోందట.
ఐతే ఇక్కడ ఒక బ్యాడ్ సెంటిమెంట్ వుంది. తెలుగు చిత్ర పరిశ్రమకి సీక్వెల్ లో నచ్చి రాలేదు. ఇప్పటి వరకూ ఒక్క సీక్వెల్ కూడా హిట్ కాలేదు. మరి ఇలాంటి నెగిటివ్ సెంటిమెంట్ వున్న ఈ సీక్వెల్ ని తేజ ఎలా మలుస్తాడో చూడాలి.