తన ఇంట్లో ఆదాయపన్ను అధికారుల సోదాలు జరపడంపై నటి తాప్సీ మొదటిసారి పెదవి విప్పారు. వీటిపై ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. గడిచిన మూడు రోజుల నుంచి తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు.
పారిస్లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ. ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్లో వెల్లడించారు.