బాలీవుడ్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ ఇళ్ళల్లో ఇవాళ రెండవ రోజు కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. కశ్యప్, తాప్సీల ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్ చేశారు. అటు మహిళా అధికారులను తాప్సీని విచారించనున్నారు.
ఆ ఇద్దరికి చెందిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. బుధవారం ఐటీ శాఖ అధికారులు సోదాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మరో మూడు రోజు పాటు ఐటీశాఖ బాలీవుడ్ స్టార్స్ ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాప్సీ, అనురాగ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ డివైస్‌లను సీజ్ చేసిన అధికారులు.. ఆ ఇద్దర్నీ తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసకువెళ్లినట్లు సమాచారం. ఆ ఇద్దర్నీ పూణెలో ఓ హోటల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఇద్దరిని లక్ష్యంగా చేసుకొని ఎందుకు దాడులు జరిగాయో.. వారిని వున్న లింక్ ఏంటో అనేది ఇంకా తెలియాల్సివుంది.