తండ్రి బాకీ బ్యాలెన్స్ చేస్తున్న రామ్ చరణ్

చిరంజీవి- కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కామ్రేడ్‌ ‘సిద్ధ’గా కనిపించనున్నారాయన. ప్రస్తుతం చిత్రీకరణలో ఉందీ సినిమా . ఇద్దరి కలయికలో వచ్చే ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా తాజాగా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు. ఇందులో రామ్‌ చరణ్‌ భుజంపై వేసిన చిరంజీవి చేయి కనిపిస్తుంది. ‘ఆచార్య సిద్ధమవుతున్నాడు’ అంటూ శివ ట్వీట్‌ చేయగా.. ‘ఇది కామ్రేడ్‌ టైం. ఆచార్య సెట్‌లో నాన్న, కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అని అని రాసుకొచ్చాడు రామ్‌ చరణ్‌.

ఐతే ఈ ఫోటో చూసిన జనాలు మాత్రం చరణ్ తన తండ్రి బాకీని తీర్చేసాడని అంటున్నారు. ఎలా అంటే మగధీర చిరు గెస్ట్ పాత్రలో కనిపించారు. తర్వాత బ్రూస్లీ సినిమాలో అతిధి పాత్రలో అదరగొట్టారు. ఐతే చరణ్ ఖైదీ నెంబర్ 150లో కనిపించింది మగధీర ఋణం తీర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో  నటిస్తూ బ్రూస్లీ బాకీ తీర్చుకున్నాడని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఐతే చరణ్ మరోసారి చిరుకు బాకీ పడాలని, చరణ్ మళ్ళీ ఆ రుణం తీర్చుకోవాలని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.