డ్రగ్స్ పై క్లారిటీ ఇచ్చిన తనీష్

డ్రగ్స్  కేసు విచారిస్తున్న బెంగళూరులో పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని   విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీష్‌ గురించి పలు ఛానెళ్లలో కథనాలు ప్రసారం కావడంపై ఆయన ఓ వీడియో సందేశం ద్వారా ఖండించారు. నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు కనీసం సంప్రదించలేదని అన్నారు. ఆ వార్తలన్నీ తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని వాపోయారు.

బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజమని, అయితే, తనకు వచ్చిన నోటీసు అర్థమేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. రెండేళ్లుగా ఆ నిర్మాతతో తనకు సంబంధాలు లేవని తెలిపారు. ఈ కేసులో తనకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరని, ‘ఫలానా వ్యక్తి గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి’ అని మాత్రమే అడిగేందుకు నోటీస్‌ ఇచ్చారని తనీష్ వివరించారు.