ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తుండగా త్వరలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అదే రోజున ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. అభిమానులు కూడా పుట్టిన రోజు కానుకగా ఏదో ఉంటుందని ముందు నుండే అంచనా వేశారు. వారు అనుకున్నట్టే ఫస్ట్‌లుక్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రాబోతుంది. అయితే ఈ ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్ ఒక్క పాత్ర మాత్రమే కనిపిస్తుందా మూడు పాత్రల గెటప్‌లు కనిపిస్తాయా..?? అని అభిమానుల కొత్త సందేహం. అది నివృత్తి కావాలంటే ఫస్ట్‌లుక్ విడుదలయ్యేదాకా ఎదురు చూడాల్సిందే మరి.