కైకాల మాట్లాడుతూ.. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తనకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు రాక పోవడం బాధాకరం అని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన పేరును అప్పటి ప్రభుత్వం పద్మ అవార్డుకు పంపించడం జరిగింది. అయితే గతంలో తాను తెలుగు దేశం పార్టీ నాయకుడిని అనే ఉద్దేశ్యంతో పద్మ అవార్డును తిరష్కరించారు.
ఆ విషయం నాకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నుండి తెలిసింది. అప్పటి నుండి తాను ప్రయత్నించలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం వంటి వారికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో మద్దతు ఉండటం వల్ల, వారి పేర్లను రికమండేషన్ చేయడం వల్ల వారికి పద్మాలు వరించాయని కైకాల చెప్పుకొచ్చాడు. తనకు ఎలాంటి అవార్డులు, గుర్తింపు రాకున్నా ప్రజలు నన్ను గుర్తించారు అది చాలు అంటూ పేర్కొన్నాడు.