తమిళంలో అజిత్ చేసిన `ఎన్నై అరిందాల్` సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఎవరో కాదు మెగాస్టార్ చిరు. 2015లో విడుదలైన సినిమా ఇది. తెలుగులో `ఎంత వాడు గానీ` రూపంలో డబ్ అయ్యింది. ఇప్పుడు చిరు దృష్టి ఈ సినిమాపై పడడం విచిత్రంగా ఉంది. రీమేక్‌లు చేయడంలో తప్పేం లేదు. కానీ చిరంజీవి లాంటి హీరోకి తెలుగులో కథలే దొరకడం లేదా? అనే అనుమానం ఇక్కడ.
ఇప్పటికే ఆయన ఖాతాలో లూసీఫర్, వేదాళం రీమేక్‌లు వున్నాయి ఇప్పుడు యుట్యూబ్ లో వున్న, ఆల్రెడీ చాలా మంది చూసేసిన `ఎంత వాడు గానీ` సినిమాని మళ్ళీ రిమేక్ తెయలనుకునే ఆలోచన మాత్రం వింత గానే వుంది. ఐతే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ రిమేక్ జోలికి వెళ్ళకుండా మరో సినిమా చేయాలని కోరుతున్నారు.