Site icon TeluguMirchi.com

చరణ్ పల్లెబాట

‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ‘ఆచార్య’ పాట చిత్రీకరణ చేశారు. దీంతో రామ్‌చరణ్‌ను చూడటానికి అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.

దేవీపట్నంలోని పాఠశాల విద్యార్థులతో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ముచ్చటించారు.  దేవీపట్నం వచ్చిన ఆమె తొయ్యేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ‘ఆచార్య’లో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ కామ్రేడ్‌ సిద్ధ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే, రామ్‌చరణ్‌లపై ఓ పాటని మారేడుమిల్లిలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరిస్తున్నారు.  

Exit mobile version