హీరో విజయ్ రాజకీయాలు గురించి కూడా మాట్లాడతాడు. గతంలో ఓటు హక్కు గురించి మాట్లాడిన సంచలనం రేపాడు ” ఓ వైపు ఓటర్లు డబ్బుకు, లిక్కర్‌కు అమ్ముడుపోవడం మరోవైపు రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం అన్నీ సర్వసాధారణం అయిపోయాయి. ఇలా లిక్కర్ తీసుకుని ఓటు వేసే వారికి ఓటు హక్కు ఉండకూడదు. ఓ విమానం నడిపే పైలట్‌ని అందులో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను కూడా సమాజంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి” అని కామెంట్స్ చేసి సంచలనం రేపాడు. అంతేకాదు తెలంగాణ సిఎం కేసీఆర్ పై విజయ్ కి మంచి అభిమానం వుంది. వీలు వున్న ప్రతి సారి ఆయన్ని పొగుడుతూఉంటాడు విజయ్. తాజాగా మరో పోస్ట్ పెట్టాడు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా.. ‘మీరు ఈ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. నీటి కోసం.. విద్యుత్తు కోసం.. పచ్చదనం కోసం.. అభివృద్ధి కోసం ఎంతో పోరాడారు. మీరు ఆరోగ్యంతో ఉంటూ మాకోసం ఇలాగే పోరాడుతూ రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నా’ అని విజయ్ ట్వీట్ చేయడం పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చకు వచ్చింది. కొందరు నెటిజన్స్ ఐతే విజయ్ గారు కేసీఆర్ పై మీకున్న ప్రేమ అర్ధం అవుతుంది. కేసీఆర్ ఆశిస్సులు మీకూ ఎప్పుడూ ఉంటాయని కామెంట్స్ చేశారు. మరి కొందరు ఐతే అసలు కేసీఆర్ చేసిన పది మంచి పనులు ఏమిటో విజయ్ చెప్పాలని కోరారు. మరికొంత మంది ఐతే మీకు నచ్చిన నాయకులు జాబితా ఒకటి పెట్టమంటున్నారు. మర విజయ్ వీటికి సమాధానం ఇస్తాడో లేదో చూడాలి.