Site icon TeluguMirchi.com

కంటతడి పెట్టించిన తారక్ మాటలు

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ వార్షిక సమావేశంలో హీరో జూ ఎన్టీఆర్ స్పీచ్ హార్ట్ టచింగ్ సాగింది. తారక్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్ వార్షిక సమావేశంలో తారక్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ  సమావేశంలో తారక్‌ మాట్లాడుతూ ‘నేను ఈ సమావేశానికి ఒక నటుడిగానే రాలేదు. ఒక పౌరునిగా, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితుడిగా వచ్చాను” అని ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు తారక్.

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నల్గొండ సమీపంలోని అన్నేవర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అంతుముందు తారక్ అన్నయ్య నందమూరి జానకీ రామ్ కూడా రోడ్డు ప్రమామాదంలోనే చనిపోయారు.

ఈ రెండు సంఘనలని గుర్తు చేసుకున్న  తారక్.. ”వాహనంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు.. దయచేసి మీ కుటుంబ సభ్యులను గుర్తుకు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు.. మీ మీద ఆధారపడిన వారు ఎదురు చూస్తుంటారు. రూల్స్‌ను కఠినంగా అమలు చేయడం వల్లగానీ.. శిక్షలు విధించడం వల్ల గానీ మనలో మార్పు రాదు. మనమంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని కోరారు తారక్. 

Exit mobile version