‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయ అవార్డు రావడంతో ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్‌కు యమ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన రీతూ వర్మకు యూత్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. ఈ అమ్మడు నిఖిల్ సరసన ‘కేశవ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రీతూ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… ‘పెళ్లి చూపులు’కు అవార్డు రావడంతో నా కెరియర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. మంచి పాత్రలను ఎంపిక చేసుకోవాలనేది మొదటి నుండే నా ఆలోచన. అందుకే చాలా అవకాశాలు వచ్చినా కూడా నా పాత్ర సరిjైున విధంగా ఉంటేనే ఒకే చెబుతున్నాను.
‘కేశవ’ చిత్రంలో నాది విభిన్నమైన పాత్ర. దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు. నేను ఈ చిత్రంలో నిఖిల్ లవర్‌గా కనిపిస్తాను. దర్శకుడు చెప్పిన స్క్రిప్టు తెగ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పారు. మొదటి నుండి కూడా విభిన్నమైన పాత్రలను చేయాలనేది నా కోరిక. ఇక అవార్డు వచ్చినాక కచ్చితంగా అలాంటి పాత్రలనే చేయాలని డిసైడ్ అయ్యా, నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చే లాంటి కారెక్టర్‌లకే ఒప్పుకుంటాను తప్పితే ఏది పడితే అది చేయను అంటూ తేల్చి చెబుతోంది. అంతేకాకుండా పారితోషికాన్ని కూడా బాగానే డిమాండ్ చేస్తోంది. దాంతో ఈ అమ్మడికి అవార్డు రావడంతో చాలా ఎక్కువ చేస్తోంది అని దర్శకనిర్మాతలు అంటున్నారు.