Site icon TeluguMirchi.com

అవార్డులని మోసపోవద్దు

భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఓ ఆన్ లైన్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. భీష్మ చిత్రాన్ని అవార్డులకు నామినేట్ చేస్తామంటూ ఆయన నుంచి రూ.63,600 డిపాజిట్ చేయించుకున్న సైబర్ మోసగాడు, నగదు డిపాజిట్ కాలేదని, మరోసారి లావాదేవీ జరపాలని కోరడంతో దర్శకుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాజాగా, దర్శకుడు వెంకీ కుడుముల ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఈ విషయాన్ని ఎందుకు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడో, అందరికీ తెలిసేలా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో వివరించారు. తనకు జరిగిన మోసం మరెవరికీ జరగకూడదని తాను భావించానని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులైనా, బయటివాళ్లయినా మోసగాళ్ల బారినపడకుండా చేయడమే తన ఉద్దేశమని వివరించాడు. 

Exit mobile version