అదీ హాస్యానికున్న పవర్

కామెడీ సినిమా అని ఈజీగా తీసి పారేస్తాం. కానీ ఆ సినిమా విజయం ఐతే మాత్రం దాని రేంజ్ మామూలుగా వుండదు. ఒక పెద్ద స్టార్ సినిమా చేసినంత వసూలు చేయగలదు. ఇప్పుడు జాతిరత్నాల సినిమా పరిస్థితి కూడా లానే వుంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా, రిలీజైన మొదటి రోజు, మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. అలా నిన్నటితో తొలి నాలుగు రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల 76 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

తొలిరోజు నుండే  సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే పూర్తిస్థాయిలో థియేటర్లు పెంచారు. అలా వీకెండ్ లో అల్లాడించిన ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. చాలా రోజులు సరైన కామెడీ సినిమా లేదు. ప్రేక్షకులు ఆత్రుతమీద వున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి లాంటి టైమర్ సినిమా మరో స్థాయిలో నిలబెట్టాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది.