అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ‘అఖిల్’ చిత్రంతో తెర మీదకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రెండో చిత్రంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అనేక కథలు విన్నాక చాలా మెరుగులు దిద్ది విక్రమ్‌కుమార్ కథకు ఒకే చెప్పారు అఖిల్ మరియు నాగ్. రెండో చిత్ర షూటింగ్ ప్రారంభం కాకముందే అఖిల్‌కు ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలితో నిశ్చితార్థం జరిగింది. తనకంటే పెద్ద వయస్సున్న శ్రియాను అఖిల్ ప్రేమించి పెళ్లికి సిద్దమయ్యాడు. కానీ ఇంత చిన్న వయస్సులో పెళ్లి ఏంటని సినీ పరిశ్రమలో చాలా మంది అఖిల్‌ను విమర్శించారు. ఆ మాటలు వినో, మరే కారణంతోనో గానీ అఖిల్, శ్రియాల పెళ్లి రద్దు అయ్యింది. మే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది కానీ కొన్ని విభేదాల కారణంగా అఖిల్, శ్రియాల పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి క్యాన్సిల్‌పై అనేక రకాల పుకార్లు వచ్చాయి కానీ అక్కినేని కుటుంబం నుండి లేదా జీవీకే కుటుంబం నుండి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. తాజాగా వీరి పెళ్లి క్యాన్సిల్‌పై మరో పుకారు షికారు చేస్తోంది. అఖిల్ మే నెలలో జరగాల్సిన పెళ్లి వద్దన్నాడని, రెండో చిత్రం విడుదలయ్యాక తనేంటో నిరూపించుకున్నాక పెళ్లి చేసుకుందాం అని శ్రియాతో చెప్పాడట. కానీ శ్రియా మరియు ఆమె కుటుంబం మాత్రం అఖిల్ తీరును అనుమానించి పెళ్లి క్యాన్సిల్ చేశారట.
పలువురు సినీ తారలు అఖిల్ పెళ్లిపై చేసిన కామెంట్లు దృష్టిలో ఉంచుకుని అఖిల్ మాట మార్చుతున్నాడు అని శ్రియా కుటుంబం అనుమానించి అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ చేశారట. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాకూడా ప్రస్తుతానికి అక్కినేని కుటుంబం బాగానే ఉంది. ఇక శ్రియా కూడా ఓ ఎన్నారైని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది.