అఖిల్, శ్రియల వివాహం క్యాన్సిల్ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా అక్కినేని ఫ్యామిలీ నుండి ప్రకటన రాలేదు. ఈ వార్తలు వస్తున్నప్పటి నుండి అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా మీడియాకు చిక్కడం లేదు. ఇటీవల అఖిల్ తల్లి అమలా రెండు సార్లు ప్రైవేట్ కార్యక్రమాల్లో హాజరు అయ్యారు. ఆ సమయంలో అఖిల్ పెళ్లి విషయమై ఆమెతో మాట్లాడివ్వాలని మీడియా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె కనీసం మీడియాను పట్టించుకోకుండా వెళ్లి పోయింది.
ఇక మరో వైపు నాగార్జున ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున చాలా మూడీగా ఉంటున్నాడని, యూనిట్ సభ్యులతో అంటి ముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి అఖిల్ చేసిన పని వల్ల నాగ్ మరియు అమలలు తలెత్తుకోలేకుండా ఉన్నారు.