అఖిల్‌ వల్ల నాగ్‌, అమలలు తలెత్తుకోలేక పోతున్నారు

nagarajuna amalaఅక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్‌లో మంచి పేరుంది. టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన పలువురు స్టార్‌ ఉన్నారు. అందుకే తెలుగు ప్రేక్షకుల దృష్టి అక్కినేని ఫ్యామిలీపై ఎక్కువగా ఉంటుంది. తాజాగా అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ వివాహం క్యాన్సిల్‌ అయిన విషయం తెల్సిందే. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించిన శ్రియ భూపాల్‌తో అఖిల్‌ వివాహంకు ఇరు కుటుంబాలు అంగీకరించి, వివాహ నిశ్చితార్థం కూడా చేశారు. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపి, పెళ్లిని ఏకంగా రోమ్‌లో జరపాలని భావించారు. అయితే కారణాలు ఏంటో కాని అఖిల్‌ పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాడు.

అఖిల్‌, శ్రియల వివాహం క్యాన్సిల్‌ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా అక్కినేని ఫ్యామిలీ నుండి ప్రకటన రాలేదు. ఈ వార్తలు వస్తున్నప్పటి నుండి అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా మీడియాకు చిక్కడం లేదు. ఇటీవల అఖిల్‌ తల్లి అమలా రెండు సార్లు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో హాజరు అయ్యారు. ఆ సమయంలో అఖిల్‌ పెళ్లి విషయమై ఆమెతో మాట్లాడివ్వాలని మీడియా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె కనీసం మీడియాను పట్టించుకోకుండా వెళ్లి పోయింది.

ఇక మరో వైపు నాగార్జున ప్రస్తుతం ‘రాజుగారి గది 2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో నాగార్జున చాలా మూడీగా ఉంటున్నాడని, యూనిట్‌ సభ్యులతో అంటి ముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి అఖిల్‌ చేసిన పని వల్ల నాగ్‌ మరియు అమలలు తలెత్తుకోలేకుండా ఉన్నారు.