షర్మిల.. కేసీఆర్ వదిలిన బాణం ?

ఒకప్పుడు వైఎస్ షర్మిల అంటే జగన్ అన్న వదిలిన బాణం అనే మాట గుర్తుకువచ్చేది. కానీ ఇప్పుడు ఈ మాట పొలిటికల్ వర్గాల్లో మరోలా వినిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వదిలిన బాణం అనేది ఇప్పుడు కొత్త డైలాగ్. అవును ..తెలంగాణలో కొత్త పార్టీ ఒకటి షర్మిల రూపంలో రాబోతుంది. అన్న జగన్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి. సోదరి షర్మిల మాత్రం తెలంగాణ కొత్త పార్టీ. ఈ ఈక్వేషన్ లోనే బోలెడంతా రాజకీయం వుంది.

ఇప్పటికి ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని వాదనలు, విశ్లేషణలు పరిశీలిస్తే.. తెలంగాణలో బిజెపి జెట్ స్పీడ్ తో దూసుకొస్తుంది. దుబ్బాక, జిహెచ్ఏంసి ఎన్నికల్లో బిజెపి కొట్టిన దెబ్బకి గులాబి పార్టీ వాడిపోయింది. ఇదే జోరు కొనసాగిస్తే.. వచ్చే ఎన్నికల్లో బిజెపి సోలోగా గెలిచేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ తప్పా మరో పార్టీ మనగడ సాధించ జాలదనే భ్రమని కల్పించిన సిఏం కేసీఆర్ కు ఆ బ్రమ నుండి బయటికి వచ్చి .. ఇప్పుడు రక్షణ వలయాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఆ రక్షణలోని బాగమే షర్మిల పార్టీ.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పార్టీలకు అతీతంగా ఆదరణ వుంది. ఆ ఆదరణతోనే జగన్ సిఎం అయ్యారు. ఏపీలో పాలించుకుంటున్నారు. అయితే తెలంగాణ వైస్ అభిమానులు మాత్రం ఇన్ యాక్టివ్ అయిపోయారు. కొందరు టీఆర్ఎస్ లో చేరిపోతే మరికొంత మంది కాంగ్రెస్ పార్టీలో వున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహణం పట్టుకుంది. ఆ పార్టీ ఇప్పట్లో లేచే అవకాశం అణువంత కూడా లేదు. తెలంగాణ కాంగ్రెస్ మొత్తన్ని కేసీఆర్ కలుపుకున్నా .. జీవం లేని ఆ పార్టీలో ఆయనికి వరిగేది ఏమీ లేదనే భావన వుంది. అందుకే కొత్త పార్టీ హాడవిడికి తెర తీశారు. షర్మిల పార్టీతో  వైఎస్ బలగమును మరోసారి బలపరిచి ఎన్నికల్లోకి వెళ్లి ఎన్నో కొన్ని సీట్లు  సాదించి, అత్యవసర పరిస్థితిలో కేసీఆర్ కి సహాయపడాలనే కోణంలో షర్మిల పార్టీ వుంటుదనే వాదన వినిపిస్తుంది.  మరి చూడాలి ముందుముందు రాజకీయం వుంటుందో ..