ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వాట్సప్ ఏ స్థాయిలో వినియోగంలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే దాదాపుగా 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారులు ఉన్నారు. వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకు వస్తుంది. కొత్త ఫీచర్స్ వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. వాట్సప్‌లో గ్రూప్ క్రియేట్ చేయడం ప్రతి ఒక్కరికి ఈజీగా ఉంటుంది. ఇక తమకు ఇష్టం వచ్చిన వారిని గ్రూప్‌లో జాయిన్ చేయడం, వారిని ఇష్టం లేకున్నా అడ్డ దిడ్డమైన మెసేజ్‌లతో దంచి కొట్టడం చేస్తున్నారు.
ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎవరినైనా జాయిన్ చేసే అవకాశం ఉండటంతో ఒక్కో యూజర్ పదుల సంఖ్యలో గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు. గ్రూప్ నుండి క్విట్ అవ్వాలంటే ఏమనుకుంటారో అనే టెన్షన్ దాంతో ఎంతో మంది గ్రూప్‌లను మ్యూట్‌లో పెట్టి వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఇకపై ఆ సమస్య లేదు. గ్రూప్‌లో ఎవరైనా మిమ్ములను జాయిన్ చేయాలి అంటే మొదట మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్‌లో కనుక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్లుగా గ్రూప్‌లో జాయిన్ చేస్తే వారి నుండి నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఓకే చేయడం చేయక పోవడం అనేది మన ఇష్టం. ఒకవేళ మూడు రోజులు పట్టించుకోకుంటే ఆటోమాటిక్‌గా గ్రూప్‌లో జాయిన్ కాకుండా ఉంటారు. దీన్ని ఇప్పటికే రెగ్యులర్ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకు రావడం జరిగింది.