‘పార్టీలు’ కాదు బాబూ.. ‘ప్రాంతమే’ ముఖ్యం.. !!

AP-Political-partiesటీ-ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో.. పార్టీల నేతలంతా.. ప్రాంతాల వారీగా చీలిపోయి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ముఖ్యం కాదన్న.. తమ ప్రాంత ప్రజలే మనోభావాలే ముఖ్యమంటున్నారు మన నేతలు. ఇవాళ వారి మనోభావాలకు జై కొట్టకుంటే.. రేపటి ఎన్నికల్లో మనల్ని తరిమికొడతారన్న బెంగ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇటు.. అధిష్టానాన్ని ఎదురించలేక.. అటు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఈ కోవలో మినహాయించే పార్టీలు రెండే రెండు వున్నాయన్నది సుస్పష్టం. అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా ఏర్పడ్డ ’టీఆర్ ఎస్’ కాగా, రెండోది.. రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్రతో స్టార్టై.. సమైక్య ముసుగు వేసుకున్న వైకాపా. వీటికే మినహాయింపు ఎందుకంటే.. ఈ రెండు కూడా ఉప ప్రాంతీయ పార్టీలుగానే ప్రజలు భావిస్తున్నారు గనుక.

కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భాజాపాలో ప్రాంతీయ ఎఫెక్ట్ కాస్త కనిపించినప్పటికినీ.. తమ అధిష్టానం తెలంగాణకు అనుకూలమని క్లియర్ కట్ గా కన్ ఫామ్ చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలు ప్రాంతీయ పోరుకు దూరంగా వున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెదేపాలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు.. బిల్లును ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పంపాలని ఓ తెలుగు తమ్ముడు అంటే.. లేదు.. తక్షణం అసెంబ్లీ చర్చకు పెట్టి అప్పుడు పంపుద్దామని మరో తెదేపా తెలంగాణ తమ్ముడు కౌంటర్ వేస్తున్నాడు.

అయితే.. క్రమశిక్షణకు మారుపేరైన తెదేపా ప్రాంతీయ పోరును బ్యాలెన్స్ చేయడంలో విజయవంతమైందనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలు ఎక్కడ బహిరంగంగా బాహాబాహికి దిగరాదని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఎదైనా వుంటే.. నాలుగుగోడల మధ్య మాట్లాడుకుందామని బాబు బరోసా వ్వడంతో.. తెలుగు తమ్ముళ్లు టెంపరరీగా ప్రాంతీయ పోరును ప్రక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రాంతీయ పోరుకు ప్రతీకగా నిలుస్తోంది.. అధికార కాంగ్రెస్. ఇరు ప్రాంతాల నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. టీ-బిల్లుపై ప్రత్యేక సమావేశాలని సీఎం అంటే.. లేదు.. ఇవాళే చర్చకు పెట్టి రేపే ఢిల్లీకి పంపుదామని డిప్యూటీ అంటారు. అవసరమైతే.. అధిష్టానాన్నే అత: పాతంలోకి తొక్కేందుకు సిద్దమయ్యారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. మీ రాజకీయ లాభం కోసం మా రాజకీయ భవిష్యత్ ను తాకట్టు పెడతారా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక టీ-కాంగ్రెస్ నేతలేమో.. ’టీ-బిల్లు పెట్టండి.. సీట్లు పట్టండి’ అనే లెవల్ లో బిల్డప్ లు ఇస్తున్నారు. తెలంగాణ ఇస్తే.. తెలంగాణలో ఎంపీ సీట్లన్నీ కూడా మనవే అంటున్నారు ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు. ఇక మిగిలిన సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, లోక్ సత్తా.. పరిస్థితి సరేసరి.

ఇలా ఏ పార్టీ కూడా పార్టీగా లేకుండా.. ప్రాంతంవారీగా విడిపోయి… ఫైట్ చేయడం ప్రారంభించాయి. మరీ ఈ ఫైట్ లో గెలిచేదేవరు.. ? ప్రాంతమా.. ? పార్టీయా.. ? అంటే.. మాత్రం రాజకీయలాభం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ప్రాంతం కోసం పట్టుపడుతున్న నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొనే కదా.. ! అంటున్నారు.