ఇక వైకాపా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే వైకాపాకు తెలంగాణలో స్థానం లేకుండా పోయింది. ఏపీలో అధికారం దక్కించుకోవాలి అంటే తెలంగాణలో పార్టీని వదిలేసుకోవాల్సిందే అని జగన్ భావించాడు. అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతంకు ఆయన ప్రయత్నాలు చేయలేదు. ఏపీ మరియు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు కొనసాగాలి అంటే సాధ్యం కాదని టీడీపీ, వైకాపాలతో తేలిపోయింది. కాని జనసేన పార్టీని మాత్రం రెండు రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఏపీకే పరిమితం అవుతాడని భావించిన పవన్ తెలంగాణ నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభించడం, దాంతో పాటు రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాను అంటూ ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్‌లకు రెండు రాష్ట్రాల్లో పార్టీని నడపడం సాధ్యం కాలేదు. అలాంటిది పవన్‌కు అది సాధ్యం అయ్యేనా అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆలోచనలో పడ్డారు. చూద్దాం భవిష్యత్తులో పవన్ జనసేన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావంను చూపుతుందో..!