సర్పంచ్ అయితేనే ఏదో గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతున్న రాజకీయ నాయకులు ఎంతో మంది ఉంటారు. సర్పంచ్ అంటూ తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసుకుని కాలికి మట్టి అంటకుండా తిరిగే వారు ఎంతో మంది ఉన్నారు. కాని ఒక ఎమ్మెల్యే ఏకంగా పొలంలోకి దిగి ఒక పూటంతా కూడా నారు పంచి వేయడం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవ్వడంతో పాటు, తోటి రాజకీయ నాయకులు సిగ్గుతో తల దించుకుంటున్నారు.
మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి నారా లోకేష్‌ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక ఎమ్మెల్యే అయినా కూడా అత్యంత సామాన్యమైన జీవితంను ఆయన గడుపుతూ ఉంటాడు. రైలు ప్రయాణం, బస్సు ప్రయాణాలు చేస్తూ తన చుట్టు ఉన్న జనాలతో కలిసి పోయే మనస్థత్వం ఆయనది. తాజాగా ఆయన పొలం పనిలో మునిగి పోయాడు. నాటు వేస్తున్న చోటుకు వెళ్లి ఏకంగా ఒక పూటంతా నారు పంచేయడం జరిగింది. సాదారణంగా కొద్ది సమయం బురదలో దిగితేనే చుక్కలు కనిపిస్తాయి. అలాంటిది ఆర్కే ఏకంగా ఒక పూటంగా పొలం పని చేశాడు. ఆ తర్వాత కూలి వాళ్లతో బోజనాలు చేశాడు. బురద కాళ్లు చేతులతోనే బోజనం చేసి అందరి దృష్టిని ఆకర్షించి గ్రేట్ లీడర్ అనిపించుకున్నాడు.