Tamannah : తమన్నా స్పెషల్ సాంగ్.. ఈ సారి అంతకు మించి…


స్ట్రీ 2లో “ఆజ్ కి రాత్” అనే చార్ట్‌బస్టర్ సాంగ్‌తో కుర్రాళ్ల మనసు దోచుకున్న తమన్నా భాటియా, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో స్పెషల్ సాంగ్‌లో మెరవబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రైడ్-2 సినిమాలో తమన్నా ఓ హై ఎనర్జీ ఐటెం సాంగ్‌కి స్టెప్పులేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాటను భారీ సెట్స్‌పై, హై వోల్టేజ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. తమన్నా ఇప్పటికే “పాండే జీ సీటీ మారే”, “కావాలై కన్న్” లాంటి పాటలతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె, ఈసారి రైడ్-2లో ఏ స్థాయిలో స్క్రీన్‌ను షేక్ చేస్తుందో అని అభిమానులు వేచి చూస్తున్నారు.

Also Read :  Garuda 2.0 : ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ 'గరుడ 2.0'

ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే… వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా రైడ్ కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అజయ్ దేవగన్ లీడ్ పాత్రలో నటిస్తుండగా, తమన్నా స్పెషల్ సాంగ్ సినిమాకి మాస్ మసాలా యాడ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఐటెం సాంగ్స్‌లో తనదైన మార్క్ వేసిన తమన్నా, ఈ పాటలో మరోసారి తన స్టెప్పులతొ, గ్లామర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం. మరి తమన్నా ఈసారి ఎంత వేడి పుట్టిస్తుందో చూద్దాం!. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెల 2 సినిమాలో నటించగా రిలీజ్ కి సిద్దంగా ఉంది.

Also Read :  Sharwa38 : శర్వానంద్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్..