Site icon TeluguMirchi.com

SWAG : ‘శ్వాగ్’ నుంచి ‘సింగ’ వచ్చేసాడు !!


‘రాజ రాజ చోర’ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘శ్వాగ్’. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. తాజాగా మేకర్స్ సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ సింగిల్ ‘సింగరో సింగ.. ‘ ను విడుదల చేసారు.

Also Read : దీపావళికి వస్తున్న ‘మెకానిక్ రాకీ’ !

వివేక్ సాగర్ ఎక్స్ ట్రార్డినరీ కంపోజిషన్, నిక్లేష్ సుంకోజీ ఆకట్టుకునే లిరిక్స్, బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మిల ఎనర్జిటిక్ వోకల్స్ పాట ఇన్స్టంట్ గా నచ్చేలా చేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. హీరో పాత్రను పరిచయం చేయడంలో దర్శకుడు హసిత్ గోలీ క్రియేటివ్ ఐడియాని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది. ఇక వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా హీరోయిన్ రీతూ వర్మ నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే శ్వాగ్ మూవీ థియేటర్లలో విడుదలకు రానుంది.

Also Read : ట్రోలర్ల కట్టడి కోసం డీజీపీకి ‘మా’ ఫిర్యాదు

Singaro Singa Music Video | Swag | Sree Vishnu | Baba Sehgal, Vaikom Vijayalakshmi | Vivek, Niklesh

Exit mobile version