Site icon TeluguMirchi.com

Mr. Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ లవ్ సాంగ్.. కెమిస్ట్రీ అదుర్స్


మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇక రీసెంట్ గా రిలీజైన షోరీల్ వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ ‘సితార్’ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read : మస్ట్ వాచ్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కాశ్మీర్ లోయల్లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై చిత్రీకరించిన ఈ బ్యూటీఫుల్ మెలోడీ అద్భుతంగా వుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రవితేజ యంగ్ లుక్ అదిరిపోయింది. ఈ పాటకు సాహితి లిరిక్స్ అందించగా.. సాకేత్ కొమండూరి, సమీరా భరద్వాజ్ పాడారు. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇకపోతే రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘మిరపకాయ్’ ఆడియో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ హిట్ కాబోతోంది. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Sitar Song Lyrical | Mr. Bachchan Movie | Ravi Teja,Bhagyashri B | Mickey J Meyer | Harish Shankar S

Exit mobile version