Peddi First Shot : దేవర రికార్డు చెరిపేసిన ‘పెద్ది’


Peddi First Shot : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 36.5 మిలియన్ల వ్యూస్ తో, ఇది ఇండస్ట్రీ హిస్టరీలో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు గ్లింప్స్ గా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ పేరిట (26.17 మిలియన్లు) ఉండగా, ‘పెద్ది’ గ్లింప్స్‌ 18 గంటలకే ఆ మార్క్‌ను దాటేసింది. అయితే లైక్స్ పరంగా, ‘దేవర’ కు 7 లక్షలకు పైగా లభించగా, ‘పెద్ది’ కు ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Also Read : Seetha Payanam : మామ డైరక్షన్ లో అల్లుడు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ !

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్-అండ్-క్లాస్ ఎంటర్టైనర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అలాగే శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ‘పెద్ది’ మూవీ 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజున గ్రాండ్‌గా విడుదల కానుంది.