ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్న బిగ్ బాస్ బ్యూటీ


తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత బిగ్ బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి గురించి బాగా ప్రచారం జరిగింది. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత సినిమాల్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకుంది. ఒకటి రెండు వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Also Read :  HHVM : హరి హర వీరమల్లు' కి త్రివిక్రమ్ ఫినిషింగ్ టచ్‌ ?

గత కొంత కాలంగా సినిమాలకు పూర్తిగా దూరం ఉంటున్న పునర్నవి తాజాగా చేసిన ప్రకటన ఆమె అభిమానులను షాక్ కి గురిచేసింది. గత కొంత కాలంగా తాను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను అంది. నేను ఆనారోగ్యం బారిన పడడం ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నాను అంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పునర్నవి అతి త్వరలోనే దాని నుండి కోరుకుంటానని కూడా చెప్పుకొచ్చింది. ఆమె అనారోగ్య సమస్య తెలిసిన ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియా ద్వారా గెట్ వెల్ అంటూ మెసేజ్ పెడుతున్నారు.

Also Read :  NTRNeel : ఫ్యాన్స్ కోసం మాస్ ఫెస్టివల్..'ఎన్టీఆర్‌నీల్‌' రిలీజ్ డేట్ ఫిక్స్ !!