Site icon TeluguMirchi.com

Buzz : ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ కాంబో కోసం బడా నిర్మాణ సంస్థల పోటీ..?


ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ గురించి ఒక్క వార్త వచ్చినా చాలు… ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ఓ డ్రీమ్ కాంబోగా ఉన్నా, ఇప్పుడు ఈ కల నెరవేరే దిశగా మళ్ళీ అడుగులు పడుతున్నట్లు ఇన్ సైడ్ ఇండస్ట్రి టాక్. ఈ మెగా ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్నట్టు బజ్ వస్తుండగానే, మరో సౌత్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ముందుకొచ్చి హీరో, డైరెక్టర్ ఇద్దరికీ బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏ అగ్ర నిర్మాణ సంస్థ అయినా సరే.. ఈ కాంబో తమ బ్యానర్‌లో చేయించేందుకు పోటీ పడుతున్నట్లు ఇండస్ట్రి వర్గాలలో చర్చ జోరుగా నడుస్తుంది.

ఇది తొలి ప్రయత్నం కాదు. ఇంతకుమునుపే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్‌ను తమ బ్యానర్‌లోకి తెచ్చేందుకు చాలా గట్టిగా ట్రై చేసిందట. కానీ ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరిగిన కాంపిటిషన్ సినీ ఇండస్ట్రీలో బడా సంస్థల మధ్య జరుగుతున్న యుద్ధంలా మారిపోయిందని టాక్. ప్రభాస్ మార్కెట్ రేంజ్, లోకేష్ నెరేషన్ స్టైల్ కలిస్తే ఏ స్థాయిలో బ్లాక్‌బస్టర్ అవుతుందో అందరికీ తెలుసు. అందుకే ఈ కాంబో కోసం ప్రొడక్షన్ హౌస్‌లు పోటీపడుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ , ఒకవేళ ఇదే నిజమైతే బాక్స్ ఆఫీసు దగ్గర కొత్త రికార్డులు నిలబెట్టడం ఖాయం.

Exit mobile version