#NTRNEEL : యంగ్ టైగర్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే..!


NTRNEEL : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లో అద్భుతమైన ఫేజ్‌ను అనుభవిస్తున్నాడు. ‘దేవర’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనకు జోష్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అదే జోష్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ భారీ మల్టీస్టారర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ‘వార్ 2’ షూటింగ్ జరుగుతూనే ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంది. తొలి షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించిన చిత్రబృందం, రాస్తారోకో, అల్లర్లు వంటి మాస్ సన్నివేశాలను ఇప్పటికే తెరకెక్కించింది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఆయన లేని సీన్లను ముందుగానే షూట్ చేశాడు ప్రశాంత్ నీల్.

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

ఇప్పుడు యంగ్ టైగర్ అడుగుపెట్టబోయే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ ఈ మాస్ యాక్షన్ డ్రామా సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్‌కు ఇది తొలి సినిమా కావడం, ఆ కాంబినేషన్‌పై ఇప్పటికే నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాస్, స్టైల్, యాక్షన్ అన్నింటికీ చక్కటి మిళితంగా రూపొందనున్న ఈ చిత్రంలో, ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించేలా ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌పై అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోయే చిత్రం ఇదవుతుందని విశ్లేషకుల అంచనా.

Also Read :  AA22 : సైలెంట్ గా #AA22 పూజా కార్యక్రమం ?