Site icon TeluguMirchi.com

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ నుంచి ‘నరసపల్లె’.. మాస్ బీట్‌తో దుమ్ములేపిన సోహెల్ !


బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాకు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా సోహెల్ మాస్ బీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

తెలంగాణ జానపదాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక కనకవ్వ పాడిన నరసపల్లె పాట యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్‌గా మారింది. ఆ పాటకు సోహెల్ మాస్ స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మిస్టర్ ప్రెగ్నెంట్ టీం తాజాగా రిలీజ్ చేసింది. అందులో సోహెల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతోనే ఇలా వెరైటీగా ప్రమోషన్స్ చేసి ఆడియెన్స్‌ దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు సోహెల్ వేసిన మాస్ స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

#Narsapalle Song | Sohel | Roopa | Mr.Pregnant | Srinivas Vinjanampati | Appi Reddy | MicTv

Exit mobile version