The Paradise Glimpse : ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఓ వైపు ‘హిట్ 3’ సీక్వెల్ లో నటిస్తూ, మరోవైపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. SLV సినిమాస్ పతాకంపై భారీ బడ్జెట్ తో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ‘ది ప్యారడైజ్’ సినిమా తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానాకెళ్లి నడిచిన శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. తల్వార్ పట్టుకున్న కాకులను ఒక్కటి చేసిన ఓ … కథ.. నాయకుడైన నా కొడుకు కథ అంటూ గ్లింప్స్ అదరగొట్టేసారు. ఇక నాని లుక్ ఐతే వేరే లెవెల్. రెండు జడలు వేసుకుని, సిక్స్ ప్యాక్ బాడీ, గన్స్‌తో మునుపెన్నడూ చూడని అవతారంలో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.
గ్లింప్స్ మొత్తం చూస్తే, ఓదెల శ్రీకాంత్ ‘దసరా’ లాంటి డార్క్ అండ్ గ్రిట్టీ వరల్డ్‌ను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ గ్లింప్స్ కథలో సస్పెన్స్, డ్రామాను పెంచుతుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. ఇకపోతే ఈ చిత్రం 2026, మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది.