శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ యాక్షన్, ఎమోషన్, గ్రిప్పింగ్ నెరేషన్‌తో మాస్ ఆడియన్స్‌ను బలంగా ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 5గా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో శివకార్తికేయన్ ఇంటెన్స్ లుక్‌తో అందరినీ ఫాసినేట్ చేశాడు.
ఎప్పుడూ తన స్టైల్ నెరేటివ్‌తో ఆకట్టుకునే ఎ.ఆర్. మురుగదాస్ ‘మదరాసి’తో మరోసారి పవర్‌ఫుల్ కథ చెప్పబోతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ మాస్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సుదీప్ ఎలామోన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్షన్ అరుణ్ వెంజరమూడు నిర్వహిస్తుండగా, యాక్షన్ ఎలిమెంట్స్‌ను కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ డిజైన్ చేస్తున్నారు. సరికొత్త యాక్షన్ జాబితాలో ‘మదరాసి’ పేరు ఖచ్చితంగా ఉండబోతుంది.