Akhil6 Title Glimpse : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఒక సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ‘హలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సినిమాలు కొంతమేర పాజిటివ్ టాక్ దక్కించుకున్నా, గత చిత్రం ‘ఏజెంట్’ తీవ్ర విఫలమైంది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్, ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి మాస్ అప్పీలింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అఖిల్ తన ఆరవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కి ‘లెనిన్’ అని ఫైనల్ చేశారు. ఈరోజు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అఖిల్ పల్లెటూరి యువకుడి పాత్రలో మాస్ లుక్‌లో కనిపించాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన అఖిల్ ఈసారి తన జోన్‌ను పూర్తిగా మార్చుకుని రూరల్ మాస్ మేనరిజంతో అదిరిపోయే రీన్‌టర్న్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఆమె కూడా విలేజ్ గర్ల్ గెటప్‌లో చాలా డీసెంట్‌గా ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్ – “మా నాయన ఒకటే చెప్తుండె.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా … పేరు ఉండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. కానీ పేరుంటాది..” ప్రేక్షకుల మనసులను తాకింది. విజువల్స్ కూడా గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ, సినిమాపై పాజిటివ్ బజ్‌ను పెంచాయి. ఈ సినిమాను అక్కినేని నాగార్జున, నాగచైతన్యల ‘మనమ్ ఎంటర్‌ప్రైజెస్’తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ పిక్చర్స్, సితారా ఎంటర్టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రాజెక్ట్‌పై పెద్ద అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మురళీ కిషోర్‌కు కూడా ఇది చాలా కీలకమైన సినిమా. తన కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాలనే లక్ష్యంతో ప్రతీ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే అఖిల్ ఈసారి కథ ఎంపికలో చాలా కేర్ తీసుకుని, మాస్ & ఎమోషనల్ టచ్ ఉన్న కంటెంట్‌తో ప్రేక్షకుల మనసు గెలవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ గ్లింప్స్ చూసిన తర్వాత “ఈసారి అయ్యగారికి హిట్ ఖాయం” అంటూ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బ్లాక్‌బస్టర్ అని కామెంట్ లు పెడుతున్నారు.