Hit 3 : మే 1కి రెడీ అవ్వండి… ట్రైలర్‌తో నాని మాస్ మానియా స్టార్ట్!


హిట్ 3 సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వైలెంట్ అవతార్ చూపించనుంది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో, వాల్ పోస్టర్ సినిమాస్, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో భారీ బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర పవర్‌ఫుల్ డైలాగ్స్, గ్రిప్పింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటోంది. ఒక 9 నెలల పాప కిడ్నాప్ చుట్టూ నడిచే కథలో అర్జున్ తనదైన శైలిలో నేరస్థులను వెంబడించి, క్రూరంగా కేసును పరిష్కరిస్తాడు. ఈ క్యారెక్టర్‌లో నాని యొక్క బాడీ లాంగ్వేజ్, డిక్షన్, ఎమోషన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి.

విజువల్స్ పరంగా సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ అద్భుతమైన పని చేశారు. మిక్కీ జె మేయర్ ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ ఈ థ్రిల్లర్‌ను మరింత ఉత్కంఠగా మార్చాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్‌లో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, “హిట్ 3 చాలా కొత్త జోనర్ లో చేసిన ఇంపాక్ట్ ఫుల్ సినిమా. మే 1న థియేటర్స్ కి వచ్చేయండి. ఈ ప్రయాణంలో మీరు నేను కలిసి గెలుస్తామనే నమ్మకం ఉంది,” అన్నారు. మే 1న విడుదల కానున్న HIT: The 3rd Case థియేటర్స్‌లో ఒక మాస్ మానియా తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.