Site icon TeluguMirchi.com

HIT – The Third Case : HIT 3 రిలీజ్ డేట్ ఫిక్స్ !


ప్రముఖ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ HIT మూడవ భాగం “HIT: The Third Case” ప్రపంచవ్యాప్తంగా మే 1, 2025న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని సైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని ప్రధాన పాత్రలో అర్జున్ సర్కార్ అనే ప్రత్యేక పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో “KGF” ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2025, నానీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో నాని పూర్తిగా కొత్త లుక్‌లో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది.

Exit mobile version