Guardian : ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న హన్సిక హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’


Guardian : హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’ చిత్రం 2024 మార్చ్ 8న విడుదలై అక్కడ ప్రేక్షకులను భయంతో ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఇదే సినిమా తెలుగులోను ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఓ ఆత్మ తన రివెంజ్ కోసం హన్సిక శరీరంలోకి ప్రవేశించి చేసే భయానక ఘటనల చుట్టూ తిరుగుతుంది. భవాని మీడియా ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. అందించిన బీజీఎమ్ హారర్ ఫీలింగ్‌ను రెట్టింపు చేసింది.

Also Read :  CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో

Also Read : Erracheera : ‘ఎర్రచీర’.. కథ చెప్పండి, రూ.5 లక్షలు గెలవండి

ఇక విజువల్స్, బిగ్గరిలించే సౌండ్ ఎఫెక్ట్స్, హన్సిక పర్ఫార్మెన్స్‌ ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాయి. కె.ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ, ఎం. తియాగరాజన్ ఎడిటింగ్‌ సినిమాకు మరింత ఉత్కంఠను జోడించాయి. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు గార్డియన్ తెలుగులో ఓ అద్భుతమైన అనుభవంగా నిలుస్తుంది. భయానికి కొత్త నిర్వచనం చెప్పే ఈ చిత్రాన్ని ఆహాలో తప్పకుండా చూడండి.

Also Read :  Kishkindhapuri : బెల్లంకొండ హర్రర్ మ్యాజిక్.. 'కిష్కింధపురి' గ్లింప్స్ అదుర్స్

Also Read : Imanvi : పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ‘ఫౌజీ’ హీరోయిన్