జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ పార్ట్ 1 గత సంవత్సరం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. చిత్రం చివర్లో దేవర 2కి సంబంధించిన చిన్న హింట్ ఇవ్వడంతో, అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ సీక్వెల్‌పై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మరియు ఎన్టీఆర్-నీల్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నందున దేవర 2 పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌ను పూర్తిచేసే దశలో ఉండగా, ఈ నెలలోనే ప్రషాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తదుపరి చిత్రానికి జాయిన్ కానున్నారు. అదే సమయంలో దేవర 2 స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫస్ట్ నరేషన్ పూర్తైనట్లు సమాచారం, ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ పరే రిలీస్ ఫంక్షన్ లో వెల్లడించారు. భారీ విజయాన్ని అందుకున్న మొదటి భాగం తర్వాత, దేవర 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో మరో సంచలన విజయం అవుతుందని అభిమానులు ధీమాగా ఎదురుచూస్తున్నారు.