AA22 Announcement : బన్నీ నెక్స్ట్ – పుష్ప కి మించి..!


AA22 Announcement : ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన “పుష్ప 2” విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విజయం తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలీ, అట్లీ వంటి ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించగా, చివరకు కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కోలీవుడ్ మేజర్ బ్యానర్ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇప్పటికే అట్లీ, బన్నీ అమెరికా వెళ్లి స్పైడర్ మ్యాన్, అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు పని చేసిన ప్రముఖ VFX మరియు మోషన్ స్టూడియోలను కలిసారు. బన్నీ లుక్ టెస్ట్‌లు, అనౌన్స్‌మెంట్ వీడియోలో ఉన్న విజువల్స్ చూస్తుంటే ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందబోతున్న భారీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.

Also Read :  Kannappa : కన్నప్ప గ్లోబల్ యాత్ర: మే 8 నుంచి అమెరికాలో విష్ణు మంచు...

Also Read : ‘కోర్ట్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ ప్రాజెక్ట్ కావడంతో #AA22 అనే హాష్ టాగ్ తో వర్కింగ్ టైటిల్ ప్రకటించారు. బన్నీ-అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ గతంలో “తెరి”, “మెర్సల్”, “బిగిల్”, “జవాన్” వంటి హిట్ సినిమాలతో తన సత్తా చాటగా, అల్లు అర్జున్ పుష్ప సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయిందని, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో #AA22 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా, బన్నీ ఈసారి పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ మరింత గ్లోబల్ స్టార్‌గా ఎదిగే అవకాశం ఉందని అంచనాలు పెరుగుతున్నాయి.

Also Read :  Garuda 2.0 : ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ 'గరుడ 2.0'