పెళ్ళైన ఓ వివాహిత..కట్టుకున్న భర్త ను ఉంచుకొని మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్కడి తో ఆగకుండా అతడి తో పెళ్లి చెయ్యాలంటూ ఊరు అవతల ఉన్న చెట్టు ఎక్కి కూర్చుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే అతడికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఈమెను పెళ్లి చేసుకుమంటే నా వల్ల కాదు అని తేల్చేసాడు. ఈ వింత ఘటన చత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే …
జష్‌పూర్‌కు చెందిన సదరు వివాహిత, పథల్‌గావ్‌కు చెందిన ఒక యువకుడితో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఆ యువకుడికి కూడా అప్పటికే వివాహమైంది. అయినా సరే వీరిద్దరూ తమ బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ..ప్రియుడిని కోరింది. దీనికి అతను ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతే వెంటనే నడుచుకుంటూ పక్క గ్రామం వద్దకు వెళ్లి, అక్కడ ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు ఎక్కి ఉరేసుకోవడానికి ప్రయత్నించింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, వారు వచ్చేవరకూ ఎటువంటి విపరీత చర్యలకూ పాల్పడకుండా ఆమెను మాటల్లో పెట్టారు. పోలీసులు వచ్చి ఆమెతో మాట్లాడి..ఆ యువకుడి తో మాట్లాడతామని..పెళ్లి చేసుకునేలా చేస్తామని చెప్పడం తో చెట్టు దిగింది.