నువ్వు అందంగా లేవు..మరో పెళ్లి చేసుకుంటానంటూ నిత్యం వెండిపూలకు గురిచేస్తున్న భర్త , అత్తమామల వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
నారాయణఖేడ్ కు చెందిన హలీమాబేగం(25)కు బోరబండ స్వరాజ్ నగర్ కు చెందిన అబ్దుల్ హాసిఫ్(32) తో 2018 జూన్ లో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. అందంగా లేవని, మరో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా హలీమాబేగంను హాసిఫ్ వేధిస్తున్నాడు.
హలీమా ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పింది. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని గురువారం ఉదయం తల్లికి ఫోన్ చేసింది. వచ్చి తనను తీసుకెళ్లాలని కోరింది. ఆ తరువాత ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి.. ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేశారు. తోటికోడలు మాట్లాడి.. హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు నగరానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.