Site icon TeluguMirchi.com

తండ్రి అనుకున్న వాడే కాలయముడయ్యాడు

రాను రాను కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు కూడా పట్టించుకోకుండా తమ కోర్కెలు తీర్చుకుంటున్నారు. తాజాగా తండ్రి అనుకున్న వాడే..తన పాలిట కామాంధుడయ్యాడు. ఒక రోజు రెండు రోజులు కాదు గత ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ నరకం చూపించాడు.

వివరాల్లోకి వెళ్తే..

వెంకటగిరికి చెందిన ఓ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయారు. దాంతో ఆమె సమీప బంధువుతో సహజీవనం సాగిస్తోంది. తన ఇద్దరు పిల్లలకు ఆ వ్యక్తే తండ్రిగా అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆమె కుమార్తె(14)పై అతడు కన్నేశాడు. భయపెట్టి ఆమెను లొంగదీసుకొని ఆరు నెలలుగా నరకం చూపించాడు. ఇతడు చేసే దారుణ పని గురించి తల్లికి చెప్పిన పట్టించుకోలేదు. కానీ ఆ బాలిక తమ్ముడు మాత్రం జరిగింది గ్రామంలోని అధికారులకు చెప్పడం తో..వారు పోలిసుల సాయం తీసుకోని నిందితుడ్ని అరెస్ట్ చేసారు.

Exit mobile version