గత ఏడాది నిజామాబాదు లో ఓ మహిళా అత్యాచారానికి గురైంది..దీంతో ఆ మహిళ గర్భం దాల్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే మహిళకు అప్పటికే నెలలు నిండటంతో ప్రసవం వరకు ఆగింది.డెలివరీ తరువాత నిజామాబాద్ కి చెందిన మరో మహిళకు బిడ్డను అమ్మాలనుకుంది. రూ. 50 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని అమ్మే ప్రయత్నం చేయడం తో ఈ విషయం పోలీసులకు తెలియడం తో సంఘటనా స్థలానికి చేరుకుని ఈ కేసుకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేశారు. పసికందును ఐసీడీఎస్‌కు తరలించారు.