Site icon TeluguMirchi.com

దారుణం : ఆన్లైన్ గేమ్స్ పిచ్చి, భార్య పిల్లల్ని చంపి…

శనివారం రాత్రి ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై, తోరైపాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే మణికందన్ అనే ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ కి ఇద్దరుపిల్లలు.. భార్య తార, పిల్లలు ధరన్‌(10), దహన్‌(01) . ఆన్ లైన్ గేమ్స్ పిచ్చిలో రెండేళ్ల క్రితం అప్పులపాలయ్యాడు . వాటిని తీర్చేందుకు , తెలిసిన వాళ్ళు అందరివద్దా అప్పులు చేసాడు. అప్పులు పెరిగిపోతున్నా, ఆన్ లైన్ గేమ్స్ పిచ్చి మానలేదు. దీంతో అప్పులు ఇచ్చిన వారి వత్తిళ్లు ఎక్కువయ్యాయి.. మణికంధన్ ఉన్మాదిలా మారిపోయాడు. భార్యని క్రికెట్ బ్యాట్ తో తలపగలకొట్టి చంపేశాడు. నిద్రపోతున్న పిల్లల ముఖంపై దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. చివరలో తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆన్ లైన్ గేమ్స్ పిచ్చి చివరకు ఇలా ఒక పండంటి కాపురాన్ని బలితీసుకుంది..

Exit mobile version