ఈరోజుల్లో ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో..అంతే త్వరగా విడిపోవడం..లేదా అనుమానాలు పెంచుకోవడం మరికాదంటే తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని చనువు చలించడం చేస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో అదే జరిగింది. ప్రేమించుకున్న యువ జంట..తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని భయపడి ఉరివేసుకొని చనిపోయారు.
వివరాల్లోకి వెళ్తే..
పొన్కల్ గ్రామానికి చెందిన కోండ నిశిత(18) ఇటీవల ఇంటర్ పూర్తిచేసింది. అదే గామానికి చెందిన సిలివేరి హరీశ్(21) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ కులాలు వేరుకావడంతో పెద్దలకు చెప్పడానికి భయపడ్డారు. ఒప్పుకోరేమోనని భావించి నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు ఒకే చీరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.