ఒంటరి మహిళా ఫై కన్నేసిన ఓ వ్యక్తి..ఆమెకు మాయమాటలు చెప్పి ..ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొద్దీ రోజులుగా ఆమెతో ఉంటున్న సదరు వ్యక్తి ..తన స్నేహితుల తో కూడా కలిసి ఉండాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోయేసరికి అర్థరాత్రి దాటాక తన ఐదుగురు మిత్రులతో కలిసి కారులో ఆమెను తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశాడు.
ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దాదాపు కార్ లో ఆమెను రెండు గంటలపాటు చిత్ర హిమాసాలకు గురి చేసి తిరిగి జడ్చర్ల మీదుగా అర్ధరాత్రి దాటాక రెండు గంటలకు మయూరి నర్సరీ సమీపంలో పర్సు, మొబైల్ ఫోన్ లాక్కొని దింపేసి వెళ్లిపోయారు. దాంతో కాలినడకన జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ మహిళ గేటు వద్ద ఉన్న కానిస్టేబుళ్లకు జరిగిన విషయాన్ని వివరించింది. అక్కడికి చేరుకున్న డీఎస్పీ శ్రీధర్ బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.