Site icon TeluguMirchi.com

తన పడక సుఖానికి అడ్డువస్తున్నాడని భర్త ను చంపిన భార్య

ఈరోజుల్లో కట్టుకున్నోడి కంటే పరాయి వ్యక్తి ముఖ్యమైపోయారు కొంతమంది ఆడవారికి..అక్రమ సంబంధాలను పెట్టుకొని తాళికట్టిన వాడినే చంపేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు పదుల సంఖ్య లో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఇదే జరిగింది. తన పడకసుఖానికి భర్త అడ్డు తగులుతున్నాడని అతడిని చంపేసింది ఓ భార్య.

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలోని బొడ్లంకలో అంబిక కొంతకాలంగా లింగంపేటకు చెందిన చక్రిదొర అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ప్రసాద్ పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి అంబిక ప్లాన్ వేసింది. ప్రసాద్‌కు సుబ్బారావుపేటకు చెందిన తన తోడల్లుడు ఎం.శ్రీకాంత్‌‌తో కొన్నాళ్లుగా గొడవలున్నాయి. దీంతో ప్రసాద్‌ను హత్య చేసేందుకు అంబిక, ఆమె ప్రియుడు కలిసి శ్రీకాంత్‌ను సంప్రదించారు. పథకం ప్రకారం శ్రీకాంత్.. ప్రసాద్‌కు ఫోన్ చేసి గొడవలన్నీ మరిచిపోదామని చెప్పి నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే జూన్ 30న ప్రసాద్‌ను మారేడుమిల్లి విహారానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగాడు. అనంతరం మత్తులో ఉన్న ప్రసాద్‌పై బండరాయితో తలపై మోది చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టగా అంబికా దొరికిపోయింది.

Exit mobile version